Apr 20,2023 19:57

ఆడబిడ్డ తండ్రికి అందజేస్తున్న వహాబ్‌

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
సంపాదించిన దాంట్లో కొంతైనా దానం చేయాలని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరిస్తున్నారు పట్టణానికి చెందిన ప్రిన్స్‌ వహాబ్‌. పట్టణానికి చెందిన ఓ ఆడబిడ్డ తండ్రి తన కుమార్తె వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ప్రిన్స్‌ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు, ఎఆర్‌ స్పోర్ట్స్‌ అధినేత వహాబ్‌ను ఆశ్రయించారు. స్పందించి ఆయన తన సొంత నిధులతో రూ.25 వేల విలువ చేసే వంటకు సరిపడ 40 రకాలకు పైగా స్టీల్‌ సామగ్రిని కొనుగోలు చేశారు. పట్టణంలోని అజంతా ఫంక్షన్‌ హాలులో గురువారం సామగ్రిని కొనుగోలు చేసి వివాహానికి 8 రోజులు ముందుగానే వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆడబిడ్డ తండ్రి ఆజాం మాట్లాడారు. క్లిష్ట సమయంలో తన కుమార్తె వివాహానికి ప్రిన్స్‌ వహాబ్‌ ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారని తెలిపారు. సేవా సమితి సభ్యులు మాచాని స్కూల్‌ మాజీ ఎఒ వైకుంఠ వాసు, మాజీ కౌన్సిలర్‌ రంగస్వామి గౌడ్‌, ఉపాధ్యాయులు వెంకటేష్‌, రెహ్మాన్‌, హీరో కృష్ణ, మహేష్‌ ఫ్యాన్స్‌ సీనియర్‌ నాయకులు ఎంఎస్‌.వాసు, తారక్‌ పాల్గొన్నారు.