Oct 29,2022 23:51

నాడు నేడు పనులకు శంకుస్థాపన చేస్తున్న లిల్లీ

ప్రజాశక్తి -హుకుంపేట: నాడు నేడు ద్వారా పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరిచి, పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎస్‌టి కమిషన్‌ సభ్యురాలు జంపరంగి లిల్లీ అన్నారు. శనివారం మండలం కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో మన బడి, నాడు-నేడు పథకంలో రూ.52లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాఠశాలలను అన్ని సౌకర్యాలు, వసులతో సుందరంగా తీర్చిదిద్ది, నాణ్యమైన విద్య అందించాలనే మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. పనులను నాణ్యతతో చేపట్టి, నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పనుల పురోగతిపై పర్యవేక్షించాలని ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో ఎంపిపి కూడా రాజుబాబు, జెడ్‌పిటిసి రేగ మత్స్యలింగం, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు టి సురేష్‌కుమార్‌, వైసిపి నేత నైని.సత్తిబాబు, ఎంపిటిసి రమ పాల్గొన్నారు.