Jun 12,2023 18:13

విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తున్న సర్పంచి అరుణ్‌ కుమార్‌

ప్రజాశక్తి - దేవనకొండ
కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా నాడు-నేడు పనులతో వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి పేద విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తోందని సర్పంచి అరుణ్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం మండలంలోని తెర్నేకల్‌ గ్రామంలో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల్లో విద్యా రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్యనందించి పదో తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించి వారి పునాదులకు బాటలు వేయాలని ఉపాధ్యాయులను కోరారు. బదిలీల్లో భాగంగా తెర్నేకల్‌కు నూతనంగా 23 మంది ఉపాధ్యాయులు బాధ్యతలు చేపట్టారు. ప్రధానోపాధ్యాయులు ఎస్‌డిఎస్‌.జ్యోతి, పాఠశాల కమిటీ ఛైర్మన్‌ వెంకప్ప, వైస్‌ ఛైర్మన్‌ అంకమ్మ, కమిటీ సభ్యులు పెద్దయ్య పాల్గొన్నారు.