Sep 16,2023 00:29

ప్రజశక్తి - చీరాల
పేద విద్యార్థికి ఈపురిపాలెంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నరేష్ రూ.5వేల ఆర్థిక సాయం చేయడం అభినందనీయమని డీఎస్పీ ప్రసాదరావు అన్నారు. స్థానిక డిఎస్పీ కార్యాలయంలో విద్యార్థికి డిఎస్‌పి చేతుల మీదగా నగదును శుక్రవారం అందజేశారు. బండారు నాగేశ్వరావు కాలనీకి చెందిన నిహారిక అనే విద్యార్థిని పదిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కడప జిల్లాలోని త్రిబుల్ ఐటీలో సీటి సాధించింది. విద్యార్థి బాగా చదువుకొని ఉన్నతంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు.