
పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట
వై ఎస్ ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ , ఎమ్మెల్సీ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి మెడికల్ కళాశాలలు, హాస్పిటల్స్ , అర్బన్ సెంటర్స్, విలేజ్ క్లినిక్ లను , ఫ్యామిలీ డాక్టర్ వంటి అనేక వైద్య సదుపాయాలు కల్పిస్తూ పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేశారన్నారని ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అన్నారు.సోమవారం నంద్యాల పట్టణంలోని వైయస్సార్ నగర్ లో 1 కోటి 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన నాలుగవ అర్బన్ హెల్త్ సెంటర్ ను ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి,ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషవలి, కౌన్సిలర్ తూర్పునాటి సావిత్రమ్మ ,వార్డు ఇన్చార్జి టీవీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి చంద్రా రెడ్డి, రాష్ట్ర ఆప్కో డైరెక్టర్ సుబ్బరాయుడు, నంద్యాల వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, కో ఆప్షన్ సభ్యుడు సలాముల్లా, వైఎస్ఆర్సిపి నాయకులు , రహంతుల్లా, పార్థుడు, సండే సుధాకర్, వైయస్సార్ నగర్ వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్పర్సన్ లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్య సేవలను అందించేందుకు మెడికల్ కళాశాల, జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ అభివృద్ది, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్, ఇంటింటికి వెళ్లి పేదలకు వైద్య సేవలను అందించే ప్రతిష్టాత్మకమైన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణాల్లో, గ్రామాలలో ప్రత్యేక క్యాంపు ల ద్వారా స్పెషలిస్టు వైద్యులను అందుబాటులోకి ఉంచి పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. పేదలకు ఉచిత చికిత్సలను, వైద్య పరీక్షలు అందిస్తూ అవసరమైన వారికి మందులను అందించడం జరుగుతుందన్నారు. అలాగే ఆపరేషన్ అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషనులను ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే నంద్యాల పట్టణంలోని వైయస్సార్ నగర్ లో అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించడం ద్వారా వైయస్సార్ నగర్ , నందమూరి నగర్ , బుడగ జంగాల కాలనీ టిడ్కో గృహ సముదాయాల్లో నివసిస్తున్న ప్రజలకు అందుబాటులో వుంటుందన్నారు. వీరందరికీ సమీపంలోనే వైద్య సేవలను అందించేందుకు అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజలు ఆరోగ్య చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు నంద్యాల పట్టణ సమీపంలో వైయస్సార్ నగర్ కాలనీని ఏర్పాటు చేసి వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అదనపు నిధులను కేటాయించి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ విస్తీర్ణంలో చాలా పెద్ద కాలనీలని, ఈ కాలనీలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.