Jun 19,2023 18:03

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న జడ్పిటిసి, సర్పంచు, ఉపాధ్యాయులు

పేద పిల్లలు మంచి విద్యను అభ్యసించాలనేదే జగనన్న ధ్యేయం : జడ్పిటిసి
ప్రజాశక్తి - పగిడ్యాల

      పేద పిల్లలు మంచి విద్యను అభ్యసించాలనేదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దేయమని జెడ్పిటిసి పుల్యాల దివ్య అన్నారు. జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు అధ్యక్షతన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జడ్పిటిసి పుల్యాల దివ్య, సర్పంచు పెరుమాళ్ళ శేషన్న మాట్లాడారు. ప్రతి నిరుపేద కుటుంబంలోని పిల్లలందరూ మంచి చదువులు చదువుకోవాలని ఉద్దేశంతో సీఎం జగనన్న పాటు పడుతున్నారని అన్నారు. మనబడి నాడు నేడు పథకం కింద పాఠశాలలకు మహర్దశని తీసుకొచ్చారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి  పాఠశాల గదులను మరుగుదొడ్లు బాత్రూములు నిర్మాణం చేపట్టి విద్యని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యను అందించాలని ఉదేశంతో  పాఠశాల గదుల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడం జరిగిందన్నారు. అమ్మ ఒడి పథకం కింద  విద్యార్థి తల్లి ఖాతాలో రూ 15 వేలు జమ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులను ఇంకా ప్రోత్సహించేందుకు జగనన్న ఆణిముత్యాలను కార్యక్రమాన్ని చేపట్టి పదవ తరగతి లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులు అందిస్తున్నాం జరిగిందన్నారు. ఎంఈఓ సుభాన్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన మొదటి బహుమతి పొందిన రియాజ్ రూ 3వేలు, రెండో బహుమతి పొందిన జానకి రూ 2 వేలు, మూడో బహుమతి పొందిన నందిని, నాగ మద్దిలేటి లకు ఒక్కొక్కరికి రూ 1వెయ్యి  చొప్పున నగదు ప్రోత్సాహ బహుమతులు జడ్పిటిసి పుల్లాల దివ్య , సర్పంచి పెరుమాళ్ళ  శేషన్న చేతుల మీదుగా నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.