Nov 13,2023 21:22

ప్రజాశక్తి - కాళ్ల
           దీపావళి పండుగ సందర్భంగా పేద పిల్లలకు దీపావళి బాణాసంచా పంపిణీ ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని మంతెన వెంకట సూర్యనారాయణరాజు సుభద్రయ్య ఫౌండేషన్‌ అధినేత మంతెన వెంకటరవివర్మ అన్నారు. భీమవరం డిఎస్‌పి బి.శ్రీనాథ్‌ సతీమణి శ్రీవిద్య చేతుల మీదుగా సుమారు వందమంది పేద పిల్లలకు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దీపావళి బాణాసంచా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో భవ్య, మంతెన హిమదుర్గ, మంతెన ఉమాశ్రీలక్ష్మి, అమృత పాల్గొన్నారు.