Oct 09,2023 23:38

ప్రజాశక్తి - అద్దంకి
పట్టణములోని శ్రీ వెంకటేశ్వర ఆర్య వైశ్య కల్యాణ మండపం, గీతా మందిరంలో రోటరి పూర్వ అధ్యక్షులు గోరంట్ల లక్ష్మీనారాయణ అమ్మమ్మ వడ్లమూడి చిన ఆదెమ్మ జ్ఞాపకార్థం 36మంది పేద మహిళలకు చీరలు సోమవారం పంపిణీ చేశారు. అనంతరం గోరంట్ల లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు. సభ్యులు మాట్లాడుతూ లక్ష్మీనారాయణ గొప్ప దాతని అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో  రోటరీ అధ్యక్షులు చిన్ని మురళీకృష్ణ, సెక్రటరీ చప్పిడి వీరయ్య, కొల్లా భువనేశ్వరి, డాక్టర్ ఉబ్బా దేవపాలన, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, సందిరెడ్డి శ్రీనివాసరావు, జాగర్లమూడి శివకుమారి, నర్రా శ్రీలక్ష్మి, తమ్మన శ్రీనివాసరావు, మలాది శ్రీనివాసరావు, పసుపులేటి ఆంజనేయులు, అంజాద్ భాషా, చందలూరి కృష్ణ పాల్గొన్నారు.