ప్రజాశక్తి - మంత్రాలయం
పేద, మధ్య తరగతి ప్రజల గొంతుక ప్రజాశక్తి దినపత్రిక అని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. బుధవారం ప్రజాశక్తి దినపత్రిక 43వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక అనుబంధాన్ని ఎమ్మిగనూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాశక్తి ప్రజల పక్షాన నిలిచి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసే పత్రిక అని తెలిపారు. కమ్యూనిస్టు భావాలతో పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్య తరగతి, కార్మిక, కర్షక ఉద్యోగులు, సామాన్యుల తరఫున పోరాడే పత్రిక అన్నారు. కమ్యూనిస్టు భావాలు కలిగిన తాను టిడిపిలో కొనసాగుతున్నా ప్రజాశక్తిని అభిమానిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపితోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో టిడిపిని ఆదరించాలని కోరారు. ప్రజాశక్తి దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, నాయకులు నజీర్ అహ్మద్, ప్రజాశక్తి దినపత్రిక ఎమ్మిగనూరు విలేకరి దేవేంద్ర మూర్తి పాల్గొన్నారు.
ప్రజాశక్తి ప్రత్యేక అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న తిక్కారెడ్డి










