ప్రజాశక్తి - చిలకలూరిపేట : రెక్కల కష్టం మీదే ఆధారపడి బతికే పేద కుటుంబం తమ పెద్ద మనస్సును చాటుకుంది. తమ కుమారుని మరణం మరికొందరికి ప్రాణాం కావాలని అవయవదానానికి ముందుకు వచ్చింది.. స్థానిక అడ్డరోడ్డు సెంటర్ వద్ద రెండు రోజుల క్రితం కేరళ ట్రావెల్స్ బస్సు ఢ కొట్టిన ఘటనలో బ్రెయిన్ డెడ్ అయిన విద్యార్థి అవయవ దానం చేశారు. ఈ ఘటనలో వాజిత అనే విద్యార్థిని కొద్ది గంటల్లోనే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గాయపడిన మరో విద్యార్థి కట్టా కృష్ణ (19)కు గుంటూరులోని రమేష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ డెడ్ నేపథ్యంలో అవయవాలను దానానికి తల్లిదండ్రులు అంగీకరించడంతో వాటిని గ్రీన్ ఛానల్ ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించారు. హెలికాఫ్టర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గుండెను తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్‌కేర్ ఆసుపత్రికి తరలించారు. లివర్‌ను విశాఖప ట్నానికి, కిడ్నీలను కర్నూలు జిల్లాకు తరలిం చారు. పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉండే కృష్ణ తండ్రి రాజు ఆటో డ్రైవర్ కాగా తల్లి మల్లీశ్వరి కూలి పనులకు వెళ్తుండారు. వీరికి మరో ఇద్దరు కుమారులు ఉన్నారు.










