ప్రజాశక్తి - చిప్పగిరి
ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం అందిస్తే సంతృప్తికరంగా ఉంటుందని ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ తెలిపారు. శుక్రవారం నేమకల్లు గ్రామానికి చెందిన సురేంద్ర, చంద్రకళలు గుమ్మనూరు గ్రామానికి వెళ్లి తమ కూతురు పెళ్లికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన నారాయణ దంపతులు వారి చేతికి వెంటనే నూతన వస్త్రాలతో పాటు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సాయం అందించినందుకు ఎస్సీ మండల కన్వీనర్ నాగరాజు, పెళ్లికూతురు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
శివాలయ నిర్మాణం, అభివద్ధికి రూ.50 వేల విరాళం
హాలహర్వి మండలంలోని శిథిరహాల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం నిర్మాణానికి సహాయం చేయాలని ఆ గ్రామ పెద్దలు గుమ్మనూరుకు వచ్చి నారాయణను కోరారు. అందుకు నారాయణ స్పందిస్తూ 10 తరాలపాటు శాశ్వతంగా దేవాలయ నిర్మాణాలు ఉంటాయని, దేవాలయ నిర్మాణాలకు తన సహాయం ఎప్పుడూ కూడా ఉంటుందని గ్రామ పెద్దలకు తెలియజేస్తూ ఇప్పటికీ రూ.50 వేలు ఇస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో తన సహకారం ఎప్పుడూ ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.
శివాలయ నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్న గుమ్మనూరు నారాయణ










