Apr 17,2023 01:30
కంటి పరీక్షలు చేస్తున్న వైద్యులు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని పెదపులివర్రు గ్రామంలో ఆదివారం పేస్‌ సొసైటీ, సందీప్‌ ఆప్టికల్స్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సచివాలయంలో నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్‌ నీలా ఉషారాణి ప్రారంభించారు. పెదపులివర్రుతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ శిబిరాన్ని వినియోగించుకొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి సొసైటీ ఆధ్వర్యంలో తక్కువ ధరలకు కళ్లజోళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో పేస్‌ సొసైటీ సెక్రెటరీ పారుపల్లి రమేష్‌, హెల్త్‌ డబుల్‌ యుఎస్‌ అధ్యక్షులు బి బాబూరావు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, విఆర్‌ఓ వెంకటేశ్వరరావు, నాయకులు రమేష్‌ తదితరులు ఉన్నారు.