Mar 09,2023 00:47
ప్రభుత్వ పథకాల పత్రం అందజేస్తున్న మంత్రి నాగార్జున

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని పెదపులివర్రు గ్రామంలో బుధవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్య కమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మెరుగు నాగార్జున ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల గురించి వివరిం చారు. ఇప్పటి వరకు లబ్ధిపొందిన ప్రతి ఒక్కరికీ పత్రాలను అందజేశారు. ప్రజా సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి డివి లలితకుమారి, సర్పంచ్‌ నీలా ఉషారాణి, నాయ కులు రమేష్‌, మల్లేశ్వరరావు, నీలా నాగరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.