పెదనందిపాడులో ఈదురుగాలుల బీభత్సం
పెదనందిపాడు: మండలంలోబీభత్సమైన ఈదురు గాలులతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం రెండు, మూడు గంటల సమయంలో ఉరుములు మెరుపులతో, భారీ ఈదురు గాలులు వీచాయి, ఈదురు గాలుల ధాటికి నాగులపాడు-బాపట్ల రోడ్డులో చెట్లు విరిగిపోయాయి. ఆరు విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. మండలం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. వరగానిలో పిడుగుపడి బొడ్డు చినబాబు సన్నాఫ్ పెదవీరయ్య కు చెందిన గేదె మృతి చెందింది. మిర్చి కల్లాల్లోని రైతులు ఇబ్బంది పడ్డారు.










