Sep 27,2022 23:56

ప్రత్యేక పర్యాటక అవార్డు అందుకున్న ఐటిడిఎ అధికారులు,

ప్రజాశక్తి-పాడేరు: అరకులోయ మండలం పెదలబుడు గిరిగ్రామ దర్శినికి మంచి గుర్తింపు లభించింది. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సం సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఐటిడిఎ గిరిగ్రామదర్శిని ప్రత్యేక పర్యాటక అవార్డును పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కె.రోజా చేతుల మీదుగా ఐటిడిఎ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం.వెంకటేశ్వరరావు, మ్యూజియం మేనేజర్‌ మురళి స్వీకరించారు.ఈ సందర్భంగా తిరుపతి కలెక్టర్‌, పూర్వ పాడేరు ఐటిడిఎ పిఒ డికె.బాలాజీ ఐటిడిఎ అధికారులను అభినందించారు.