ప్రజశక్తి - చీరాల
పెడల్ ఫర్ ఫ్రీడంపై అవగాహన అవసరమని షాడోస్ కో ఆర్డినేటర్ రాజా సాల్మన్ అన్నారు. షాడోస్, రెడ్ రోప్, ఆపరేషన్ విముక్తి, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, స్థానిక వైఏ డిగ్రీ కాలేజ్, గర్ల్స్ హై స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న పెడల్ ఫర్ ఫ్రీడం కార్యక్రమంలో యాక్సెస్ టు జస్టిస్, క్యాంపెయిన్ విముక్తి, జీరో టాలరెన్స్ హ్యూమన్ ట్రాఫికింగ్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్, అడాల సెంట్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఏడు జిల్లాలలో ఈనెల 20 నుంచి 26 వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్ల్స్ హైస్కూల్, వైఏ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. చైల్డ్ అబ్యుజ్ గురించి వివరించారు. రెడ్ రోప్ నుంచి క్రి స్టో లైట్, అడాల సెంట్, చైల్డ్ మ్యారేజ్, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ గురించి వివరించారు. కార్యక్రమంలో గర్ల్స్ హై స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపల్ బాబు, వైఎ కాలేజ్ ప్రిన్సిపాల్ రమణమ్మ, పిడి లీలా కుమారి, రెడ్ రోప్ ప్రతినిధి క్రిస్టోలిన్, షాడోస్ ఫీల్డ్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, కుసుమ, జహీదా పాల్గొన్నారు.










