Oct 06,2023 21:24

పెద్దపులి పాదముద్రలు

పెద్దపులి సంచారం
- భయాందోళనలో గొర్రెల కాపరులు
ప్రజాశక్తి - కొత్తపల్లి

       కొత్తపల్లి మండలంలోని చిన్నగుండం నీటిమడుగు వద్ద పెద్దపులి సంచారం శుక్రవారం గొర్రెల కాపరుల కంట పడింది. వివరాలు.. కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం, జానాల గూడెం గ్రామాలకు రెండు కిలోమీటర్ల దూరంలో మల్లయ్య సెల ప్రాంతంలో ఉన్న చిన్నగుండం నీటి మడుగులో పెద్దపులి నీళ్లు తాగుతుండడాన్ని గొర్రెల కాపరులైన తిక్క స్వామి, ప్రదీప్‌, నరసింహ, పెద్ద మద్దిలేటి గమనించారు. వెంటనే గొర్రెల కాపరులు పెద్దగా కేకలు వేయడంతో పెద్దపులి అడవిలోకి పోయింది. పెద్దపులి అడవిలోకి వెళ్లి పోవడంతో గొర్రెల కాపరులు ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనప్పటికీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దపులి పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లోకి రాకుండా పలు చర్యలు తీసుకుంటామని సంబంధిత ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు.