మంగళగిరి: ఎండ తీవ్రత వడగాల్పుల ప్రభావం వల్ల ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే పెద్ద కోనేరు మరమ్మతు పనులను చేస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పుష్కరిణిగా పిలవబడే పెద్ద కోనేరు పూడిక తీత,అభివృద్ధి పనులను ఆయన గురువారం పరిశీలిం చారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, కోనేరు మరమ్మతు పనుల నిమిత్తం మద్రాసు నుంచి ప్రత్యేక యం త్రాన్ని రప్పించి పనులు జరిపిస్తున్నామని తెలిపారు. ఇన్ని రోజులు శ్రమించినప్ప టికీ లోతు భాగాన్ని అంచనా వేయలేక పోతున్నా మని, అయితే వైశాల్యం తగ్గుతుందని అన్నారు. కోనేరు పనులు తుది ఘట్టానికి చేరుకున్నాయని అన్నారు.
నూరు శాతం భాగవతుల వారి వీధి రహదారిని విస్తరిస్తాం
న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూ చట్టా నికి లోబడి నగరంలోని భాగవతుల వారి వీధి రహదారిని విస్తరించే ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. రాజధానికి తగినట్లుగా మంగళగిరి అభివృద్ధి చెందకపోవడం బాధా కరమైన విషయమని అన్నారు. ప్రజలు తాము కొనుగోలు చేసిన కారును తమ ఇంటి వరకు తీసుకువెళ్లలేని పరిస్థితుల్లో మంగళగిరిలో రోడ్లు విస్తరణ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తయిన తర్వాత భాగవతుల వారి వీధి విస్తరణ ప్రారంభిస్తామని తెలి పారు. ప్రగడ కోటయ్య పేరిట నిర్మాణం జరుగుతున్న చేనేత భవన్‌ను జాతీయ చేనేత దినోత్సవం నాడు ప్రారంభిస్తామని అన్నారు.
15 రోజుల్లో స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభిస్తాం
స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ రింక్ లను మరో 15 రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రేపల్లె ప్రాంతానికి చెందిన షం షేర్ ఖాన్ అనే వ్యక్తి 1956లో ఆస్ట్రేలియా ఒలింపిక్స్ లో ఈత పోటీల్లో ఐదవ స్థానంలో నిలిచినట్లు చరిత్ర ద్వారా స్పష్టమవుతుందని అన్నారు.
2017లో రేపల్లెలోని తన స్వగృహం వద్ద అత్యంత దయనీయమైన పేదరికంలో చనిపోయారని అన్నారు. ఈ నేపథ్యంలో స్విమ్మింగ్ పూల్ కు సంషేర్ ఖాన్ పేరు నామకరణం చేయాలని నిర్ణ యించినట్లు తెలిపారు. ప్రక్కనే నిర్మితమవు తున్న పవర్ లిఫ్టింగ్ అకాడమీకి ఇటీవల మరణించిన పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వర రావు పేరును నామకరణం చేయ నున్నట్లు చెప్పారు.










