వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి -పెద్దకడబూరు
ఆదోని నుంచి పెద్దకడబూరుకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం నాయకులు కోరారు. సిపిఎం ఆదోని డిఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఈడిగ తిక్కన్న, సిఐటియు మండల కార్యదర్శి ఉప్పర ఈరన్న మాట్లాడారు. స్కూల్ ఉన్నప్పుడు మాత్రమే పెద్దకడబూరుకు బస్సు వస్తుందని, స్కూల్ అయిపోయిన తర్వాత బస్సును రద్దు చేస్తున్నారని తెలిపారు. స్కూలు ఉన్నా, ఉండకపోయినా బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. కల్లుకుంట మీదుగా పెద్దకడబూరు, చిన్న తుంబలం వరకు బస్సు వేయాలని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కచ్చితంగా ఆలోచించి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీఇచ్చారు.










