Jul 24,2023 00:17

కరాటే పోటీలను ప్రారంభిస్తున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -ఆనందపురం: కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యాన ఆనందపురం మండలం పెద్దిపాలెం కింగ్స్‌ ఫంక్షన్‌ హాలులో మూడవ ఆంధ్రప్రదేశ్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌ పోటీలను భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చాంపియన్‌ షిప్‌లో రాష్ట్రంలో 13 జిల్లాల నుండి 400 మంది బాల బాలికలు పాల్గొంటున్నారని, వీరందరినీ తీర్చి దిద్దిన మాస్టార్ల కృషి వెలకట్ట లేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ దౌలపల్లి కొండబాబు, కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు కోలా ప్రతాప్‌ కుమార్‌, స్టేట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వాసుపల్లి శ్రీహరి, జనరల్‌ సెక్రటరీ జి.ఆనంద్‌బాలు, కోశాధికారి ఎమ్‌వి.రామమూర్తిరాజు పాల్గొన్నారు.