Oct 24,2023 20:34

పెద్ద దర్గాను సందర్శిస్తున్న కమిటీ సభ్యులు

 కడప అర్బన్‌ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమీన్‌ పీర్‌(పెద్ద దర్గా)ను ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా పెద్ద దర్గాలో ప్రార్ధన చేసి దర్గా విశిష్ట తలను అడిగి తెలు సుకున్నారు ఈ సందర్భంగా ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సయ్యద్‌ సలావుద్దీన్‌, జియావుల్‌ రెహమాన్‌ మా ట్లాడుతూ రాష్ట్ర పర్యటనలో భాగంగా కడపలో ముస్లిం ఐక్యవేదిక స్టీరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలు అనుసరించాల్సిన వ్యవహారాలపై చర్చించినట్టు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచి ముస్లిములు అత్యధిక శాతం సీట్లు వచ్చేలా రాజ్యాధికారం దిశగా హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జాఫర్‌, సయ్యద్‌ ఖలీల్‌, నూర్‌, సలావుద్దీన్‌( గుంటూరు), కలాం, జాబిద్‌, నాయకులు పాల్గొన్నారు.