పెద్దదర్గాలో హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రార్థనలు
కడప అర్బన్ : కడప నగరంలోని అమీన్‌పీర్ దర్గాలో శుక్రవారం ప్రముఖ సినీ హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పూలచాదర్ సమర్పించారు. తేజ్‌కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. దర్గా మత పెద్దలు అమీన్‌పీర్ దర్గా విశిష్టతను సాయిధరమ్‌తేజ్‌కు తెలియజేశారు. తొలిసారిగా తాను కడప పెద్దదర్గాను దర్శించుకుని ఆత్మసంతప్తి పొందానని తేజ్ చెప్పారు. దర్గాను దర్శించు కోవడం చాలా సంతోషంగా ఉందని తేజ్ అన్నారు. హీరో సాయి ధరమ్ తేజ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అనంతరం దుర్గమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దదర్గాలో ప్రార్థనలు చేస్తున్న సాయి ధరమ్‌తేజ్










