ప్రజాశక్తి-ఆదోనిరూరల్
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న మండలంలోని పాండవగల్ గ్రామంలో పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని సిపిఎం నాయకులు కోరారు. గురువారం సిపిఎం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కె.లింగన్న, నాయకులు జె.రామాంజనేయులు, శాఖ కార్యదర్శి కె.పాండురంగ మాట్లాడారు. పాండవగల్ గ్రామంలో సర్వే నెంబర్ 135లో ఉన్న 20 ఎకరాల పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని కోరారు. హైకోర్టులో కేసును వేగవంతం చేయాలని, ప్రస్తుతానికి పొలం సాగు చేయకుండా ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ సమస్యపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తహశీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కోర్టులో కేసును వేగవంతం చేసి స్టే వేకెట్ చేయించాలని కోరారు. అలాగే పొలం సాగుదారులు ఎవరూ పొలంలోకి వెళ్లకుండా ఉండాలన్నారు. మధ్యలో స్టే వేకెట్ అయితే రైతులు ఇబ్బంది పడతారని తెలిపారు. వైసిపి నాయకులు ఆర్.శ్రీనివాస్ రెడ్డి, హనీఫ్ బాషా, గోవిందు, నాయకులు కృష్ణ, భీమయ్య, వై.హుసేని, కె.భీమాంజనేయ, హనుమంత రెడ్డి, నర్సిరెడ్డి, రమేష్, డిజె.నర్సిరెడ్డి, కె.కొండయ్య, వై.తాయన్న, హోటల్ ఈరన్న, కె.హుసేని, కె.ఆంజనేయ, రైతు టి.గోవిందు రెడ్డి, పి.ప్రసాద్, పాతిరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు










