Jul 12,2023 15:10
  • రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ మహిళ అధ్యక్షురాలు నంగా పద్మజా రెడ్డి

ప్రజాశక్తి-పాకాల: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మహిళలకు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నంగా పద్మజా రెడ్డి అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా బుధవారం పాకాల పట్టణంలో వాలంటీర్లతో ధర్నా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటీర్లపై జనసేన పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై బేసెరత్తుగా మహిళలకు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ వాలంటరీ వ్యవస్థ సచివాలయం ద్వారా ప్రజలకు నిత్యం ప్రభుత్వ పథకాలను ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ పనితీరును చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని, అలాంటి వాలంటరీ వ్యవస్థపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను కించపరిచి బాధపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి వాలంటీర్లు అందించిన సేవలు అమోఘం అని, ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటున్నారని, అలాంటి వారిని ఇలా నీచంగా మాట్లాడడం ఎంతవరకు సభవు అని దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.పవన్ కళ్యాణ్ అవినీతి చేసే ప్రతి ఒక్కరి నాయకులను, పార్టీల గురించి ప్రశ్నిస్తున్నాను అనే అతను వారిపై ఎలాంటి మాటలు మాట్లాడకుండా నిత్యం ప్రజలతో ఉండే వాలంటీర్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఆయన క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో ఉద్యమ పోరాటాన్ని చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ధనలక్ష్మి, కస్తూరి, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, వాలంటరీలు, తదితరులు పాల్గొన్నారు.