Feb 16,2023 00:05

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాబూరావు

ప్రజాశక్తి- యస్‌.రాయవరం:ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని గోకులపాడు గ్రామం లోని తులసి కల్యాణ మండపంలో గృహ సారధుల శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల్లోకి వెళ్లి జగనన్న అమలు చేసిన పథకాలను వివరించాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువై 2024 ఎన్నికల్లో మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. టిడిపి పార్టీకి ఎల్లో మీడియా రధ సారదులని, ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
పాయకరావుపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ, రానున్న కాలం ప్రతి ఒక్కరికి ఏంతో విలువైనందున కష్టపడి పార్టీ కోసం శ్రమించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు పోలిశెట్టి పెద ఈశ్వరరావు, నూకి నాయుడు, శ్రీపతి రాజు, మాతా గురునాధరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.