ప్రజాశక్తి-పెదబయలు(అల్లూరి) : పాడేరు నుండి వయా లక్ష్మీ పేటకు వెళ్లే పాడేరు ఆర్టీసీ బస్సు కండిషన్ లో లేక ఆదివారం మండల కేంద్రమైన పెదబయలు నుండి ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో వెనక్కి తిప్పేశారు. వివరాల్లోకి వెళితే ఆదివారం ఉదయం పాడేరు నుండి ఆరాడ గూడెం బస్సు వెళ్లాల్సి ఉంది. కానీ బసడు ఆరాధగూడెం ఘాటీ ఎక్కదని టికెట్స్ ఉన్న బస్సు నడపడం కష్టంగా ఉందని సిబ్బంది ప్రయాణికులతో చెప్పడంతో బస్సు ఎక్కినా సుమారు 20 మందిని పెదబయలు మండల కేంద్రంలో ప్రయాణికులను దించేశారు. దింతో గత్యంతరం లేని పరిస్థిలో ప్రయాణికులు అధిక చార్జీలు చెల్లించి ఆటోలపై ప్రయాణమయ్యారు. బస్సు కందిస్సాన్లో ఉందొ లేదో ఆర్టీసీ డిపోలోనే పర్యవేక్షణ చెయ్యాలని ప్రయాణికులతో చెలగాటం ఆధారదని స్థానిక ప్రయాణికులు అంటున్నారు. ఇకనుండి నైనా ఆర్టీసీ సిబ్బంది సత్వారా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.










