ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పదవులు శాశ్వతం కాదని పలువురు నాయకులు పేర్కొన్నారు. తలారి హనుమంతప్ప ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ పెద్దకడబూరు బ్రాంచి మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ జూన్ 30న విరమణ పొందారు. ఆయనను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సన్మానించారు. ఆదివారం పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో హనుమంతప్ప స్వగృహంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్.దేవసహాయం, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర కార్యదర్శి జి.ఆనంద్ చైతన్య మాదిగ, దళిత, బహుజన రచయిత, ఉపాధ్యాయులు ఆరేకంటి భాస్కర్, ఎంఎఫ్‌ఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు రంగన్న, ఐటిడిపి మంత్రాలయం నియోజకవర్గ అధ్యక్షులు సాల్మన్ రాజు హనుమంతప్ప దంపతులకు శాలువా కప్పి, పూలమాలలతో సన్మానించారు. భారత రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్.అంబేద్కర్ చిత్రపటాన్ని బహూకరించారు. పదవులు శాశ్వతం కాదని, చేసే పనులే శాశ్వతమని తెలిపారు. ప్రతి ఉద్యోగికీ విరమణ సర్వసాధారణమన్నారు. హనుమంతప్ప శేష జీవితం దళిత, బహుజన వర్గాల శ్రేయస్సు కోసం సాగాలని ఆకాంక్షించారు.
సన్మానం చేస్తున్న నాయకులు










