Mar 10,2023 00:02

స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యప్రకాశరావు, ప్రజాశక్తి మేనేజర్‌ వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి -గాజువాక : ప్రజాశక్తి తెలుగు దినపత్రిక ఆధ్వర్యాన కణితి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పదో తరగతి స్టడీ మెటీరియల్‌ను గురువారం అందించారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి విశాఖ ఎడిషన్‌ మేనేజర్‌ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజాశక్తి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఆశయంతోనే ప్రజాశక్తి స్టడీ మెటీరియల్‌ పంపిణీచేస్తున్నట్లు తెలిపారు. మూఢ విశ్వాసాలను విడనాడి, శాస్త్రీయంగా ఆలోచింపజేసే పత్రిక ప్రజాశక్తి అని చెప్పారు. విశాఖలో ప్రజాశక్తి ఎడిషన్‌ పెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వరద సమయంలో విరాళాలు సేకరించి తిరుపతి, నెల్లూరు, కేరళలో బాధితులకు అందజేశామని చెప్పారు. కరోనా సమయంలో ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్‌ ఎడిటర్‌ ఆర్‌కె.నాయుడు మాట్లాడుతూ, విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదవాలని కోరారు. ప్రజాశక్తి చెడుకు వ్యతిరేకంగా, మంచి సమాజ నిర్మాణం కోసం ఏర్పడిన పత్రిక అని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి సిబ్బంది వై.సత్యనారాయణ, స్కూల్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.