Aug 03,2023 19:59

వ్యాయామ ఉపాధ్యాయులను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - ఆదోని
స్కూల్‌ అసిస్టెంట్‌ ఇన్‌ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌గా పదోన్నతి పొందిన 18 మంది వ్యాయామ ఉపాధ్యాయులను సన్మానించారు. గురువారం ఆదోని మున్సిపల్‌ హైస్కూలులో జరిగిన కార్యక్రమానికి ఎపి పిఇటిస్‌ అసోసియేషన్‌ ఆదోని జోన్‌ చీఫ్‌ పాట్రాన్‌ గోపాల్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను సన్మానించడం మంచి సాంప్రదాయమని తెలిపారు. మరింత ఉత్సాహంతో పని చేసి విద్యార్థుల జీవితాలకు మంచి పునాదులు వేయాలని ఆకాంక్షించారు.