బ్రోచర్లను ఇస్తున్న విజయనిర్మల
ప్రజాశక్తి - అరిలోవ : జివిఎంసి పదో వార్డు ఎస్‌ఐజి నగర్, రామాలయ ప్రాంతంలో వార్డు వైసిపి ఇన్‌ఛార్జి జగ్గుపిల్ల జయ అప్పలరాజు ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీయడంతోపాటు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పతివాడ వెంకటలక్ష్మి కనకరాజు, వైదా నారాయణరావు, ఓమ్మి శ్రీను, మన్యల రమణ, రజిని, మొల్లి వెంకటరమణ, చలం, తులసి కనకమ్మ, గోవింద్ పాల్గొన్నారు.










