Apr 09,2023 00:11

చికిత్స పొందుతున్న విద్యార్థిని

ఇంకొల్లు రూరల్‌ : ఇంకొల్లులోని ఆదర్శ హైస్కూలులో పదో తరగతి పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని శనివారం అస్వస్థతకు గురైంది. పరీక్ష రాస్తున్న సమయంలో ఫిడ్స్‌ రావడడంతో కుప్పకూలి పోయింది. వెంటనే ఆ విద్యార్థిని ఇంకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎస్‌ఐ షేక్‌ నాయబ్‌ రసూల్‌ అస్వస్థత గురైన విద్యార్థి వెంటే ఉండి వైద్య పరీక్షలు చేయించాడు. విద్యార్థి అనార్యోగం పట్ల సకాలంలో స్పందించిన ఎస్‌ఐ నాయబ్‌ రసూల్‌కు విద్యార్థి తల్లిదండ్రులు, ప్రజలు అభినందనలు తెలిపారు.