పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
3 నుండి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు
పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
హాజరుకానున్న 198 మంది విద్యార్థులు
ప్రజాశక్తి - రుద్రవరం.
ఆదర్శ పాఠశాల రుద్రవరం లో సోమవారం నుంచి ప్రారంభం అయ్యే 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్ మరియు కస్టోడియన్ అయిన ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు పకడ్బందీ గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 3 నుండి నుంచి మొదలై 18 వ తేదీ వరుకు కొనసాగనున్నాయి . ఉదయం 8.45 నుండి విద్యార్థులను రూంలలోకి పంపిస్తాం అన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.45 వరుకు పరీక్షలు జరుగుతాయి అని అన్నారు. కాబట్టి అందరూ తప్పకుండా పరీక్షా కేంద్రానికి ముందుగా చేరుకొని ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశేలా అన్ని ఏర్పాట్లు ఫర్నీచర్, విద్యుత్ , మంచినీటి సౌకర్యం వంటి అన్ని సౌకర్యాలు కల్పించామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా సి. సి. కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరిక్ష కేంద్రo వద్ద ప్రథమ చికిత్స కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో ఒక ఎ. ఎన్. ఎమ్, బందోబస్తు కింద పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు అని, పరీక్ష సమయంలో కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది అని ఆయన తెలిపారు. అలాగే రుద్రవరంలోని జడ్పీఎస్ ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పాఠశాలలో కూడా పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు.










