Jan 17,2021 17:21

నేల గుండెల్ని చీలుస్తూ ....
పచ్చని కావ్యాలు రాసే నాగలి కర్రయినా

లోహపు కండల్ని కరిగిస్తూ ...
మెరుపు పూలు పూయించే లేత్‌ మిషన్‌ అయినా

జటిల సమస్యలను పరిష్కరిస్తూ ...
సుఖ జీవన తిలకాలు దిద్దే మౌస్‌ అయినా

శ్రామికుడి చేతితో కలిస్తేనే ...
సంపద తయారవుతుంది
మానవ జీవితం సస్యశ్యామలం అవుతుంది.!
నాగరికతా ప్రస్థానం నిత్య నూతనం అవుతుంది!

శ్రమని దోచే చీడపీడలూ ...
పెట్టుబడిదారులూ... కార్పొరేట్లూ ...
ఎల్లకాలం ఉంటూనే ఉంటారు
మన కష్టార్జితం తింటూనే ఉంటారు !

మనల్ని మనం కాపాడుకునే ...
రక్షణ కవచాలే ఐక్యతా పోరాటాలు!

మిత్రమా...!
అవన్నీ 'చరిత్ర' అనీ
ఈ కాలానికి పనికిరావనీ
అనుకున్న నీ అజ్ఞానమూ ... పిరికితనమూ
పటాపంచలయ్యే కాలం దగ్గర పడింది...!

పడమటి దిక్కున అరుణోదయం అవుతోంది...
ఆ .. వేకువని ఒడిసి పట్టుకుందాం !

బొల్లాప్రగడ వెంకట పద్మరాజు
9849899676