Sep 18,2023 00:21

ప్రజాశక్తి - అద్దంకి
స్థానిక రామసుశీల నిలయంలో ఆదివారం జరిగిన పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మ సాహిత్య పురస్కార సభకు వారణాసి రఘురామశర్మ ధ్యక్షతవహించారు. కవిగా, అవధానిగా, అనువాదకునిగా, కథారచయితగా, నవలారచయితగా, పరిశోధకునిగా, జీవిత చరిత్రకారుడిగా, వ్యాఖ్యాతగా, రేడియో, దూరదర్శిని సృజనాత్మక కార్యక్రమాల రూపశిల్పిగా, ఐఎఎస్ విద్యార్థుల శిక్షకులుగా అనంత ప్రతిభాపాటవ మూర్తి రేవూరి అనంత పద్మనాభరావుకి పురస్కారం ఇవ్వడం ద్వారా వాగ్దేవిని గౌరవించడమేనని సభాప్రారంభకులు, పురస్కార ప్రదాత  పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి పేర్కొన్నారు. కవి డివిఎం సత్యనారాయణ మాట్లాడుతూ పద్మనాభరావు సేవలను సభకు తెలిపారు. దూరదర్శన్‌లో అత్యున్నతమైన అదనపు డైరక్టర్ జనరల్‌గా అద్భుతమైన కార్యక్రమాలు రూపకల్పన చేశారని అన్నారు. 21వ ఏటనే అవధానాన్ని ప్రారంభించి, యాభైకిపైగా అవధానలు చేశారని అన్నారు. పివి గిరి, ప్రకాశం పంతులు, దుర్గాభాయ్ దేశముఖ్, శంకరంబాడి సుందరాచారి జీవిత చరిత్రలు రాశారని అన్నారు. 10కిపైగా ఆంగ్ల గ్రంధాలను తెలుగులోకి అనువదించారని అన్నారు. 'మార్నింగ్ ఫేస్ 'గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయ అనువాద పురస్కారం లభించిందని అన్నారు. భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు అనే ఆయన రచన తెలుగుసాహిత్యానికి నిలువుటద్దమని అన్నారు. రూ.10వేలు పురస్కార నగదు, పట్టువస్త్రాలు సమర్పించారు. పురస్కారం అందుకోవడం ప్రసన్నాంజనేయస్వామి ప్రసాదంగా భావిస్తున్నట్లు అనంత పద్మనాభరావు అన్నారు. ఆదివారం పుట్టిన రోజు జరుపుకుంటున్న పంకజ్ పార్థును ఆహూతులు ఆశీర్వదించారు. కార్యక్రమంలో సాహితీ మిత్రమండలి అధ్యక్ష, కార్యదర్శులు లక్కరాజ చంద్రశేఖర్, కెవి పోలి రెడ్డి, చుండూరి మురళీసుధాకరరావు, డాక్టర్‌ యు దేవపాలన, ఆర్‌వి రాఘవరావు, చప్పిడివీరయ్య, వామరాజు వెంకటేశ్వర్లు, ఇలపావులూరి శేష తల్పశాయి, లక్కరాజు విశ్వమోహన్, కొండకావూరి కుమార్, ఓరుగంటి శ్రీనివాసరావు, కంఠంరాజు శివరామ కోటేశ్వరరావు, గోపినాథం హరనాథ్, కూరపాటి రామకోటేశ్వరరావు, షేక్ మస్తాన్, పిసిహెచ్ కోటయ్య, జాగర్లమూడి ప్రతాప్, జమ్మలమడక హనుమంతరావు, బాచిన పూర్ణచంద్రరావు, దివి లింగయ్య నాయుడు, వీరవల్లి రుద్రయ్య, చిన్నిమురళీకృష్ణ, మారం కోటేశ్వరరావు, నారాయణ బాలసుబ్రహ్మణ్యం, అళహరి హరిబాబు, అంజాద్ భాష, లాయర్ రమేష్, మహమ్మద్ రఫీ, అంజాద్ భాష పాల్గొన్నారు.