Aug 28,2023 23:15

ప్రజాశక్తి - యద్దనపూడి
మండలంలోని చీమటావారిపాలెంకు చెందిన గనిపిశెట్టి పద్మజ అనే మహిళా రైతుకు ప్రకృతి వ్యవసాయం చేసినందుకు జైవిక్ ఇండియా అవార్డు వచ్చింది. గత 2022-23 సంవత్సరం 2.50 ఎకరాలులొ శనగ పంట పండించి నందుకు ఈ అవార్డు లభించినట్లు ఆమె తెలిపింది. 1.50ఎకరం సొంత భూమికి మరో ఎకరం కౌలుకు తీసుకొని సాగు చేసినట్లు తెలిపారు. 2.50ఎకరాలలో 30క్వింటాళ్లు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు ఆ శనగలు యద్దనపూడి కొనుగోలు కేంద్రంలొ అమ్మినట్లు తెలిపారు. సెప్టెంబర్ 7, 8 తేదీల్లో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రధానం చేస్తారని ఆమె తెలిపారు.