Jun 18,2023 00:45

నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్న కార్పొరేటర్‌ కెల్ల సునీత

ప్రజాశక్తి - ఆరిలోవ : శ్రీకృష్ణాపురం గురుకుల పాఠశాలలో పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. శనివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత హాజరై పాఠశాలలో ప్రథమ స్థానం పొందిన దేముడు బాబుకు రూ.3వేలు, ద్వితీయ స్థానం పొందిన తరుణ్‌ శ్రీదేవ్‌కు రూ.2 వేలు, తృతీయ స్థానం పొందిన ప్రసాద్‌కు రూ.1,000 అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ కెల్ల సునీత మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని క్రమ శిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ బికె.రమేష్‌, వైసిపి నాయకులు వెంకట రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.