Mar 11,2023 19:38

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఇఒ సుభాన్‌

పదిలో మంచి మార్కులు సాధించాలి: ఎంఇఒ

ప్రజాశక్తి - పగిడ్యాల

పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఎంఇఒ సుభాన్‌ విద్యార్థులకు సూచించారు. శనివారం మండలంలోని ప్రాతకొట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒ మాట్లాడారు. పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఇంకా 25 రోజులు సమయం ఉందని కష్టపడి మంచి మార్కులు సాధించి పాఠశాలకు గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 25 రోజుల వ్యవధిలో ఇంటి వద్ద కూడా తమ పిల్లలు చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం గ్రామంలోని ఎంపిపి పాఠశాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.