May 07,2023 01:41
ఆదర్శ విద్యార్థులను అభినందిస్తున్న విజయభాస్కర్‌

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఇంకొల్లు మండలం పూసపాడు డ్రీమ్జ్‌, యూనివర్సల్‌ హైస్కూలు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 594 మార్కులు జాగర్లమూడి పావనిశ్రీ, 593 మార్కులు కె సాయి హిమజ, 591 మార్కులు బి యెహోషువా, 590 మార్కులు బి సాయి శ్రీజ, 588 మార్కులు డి హన్సికా, 586 మార్కులు జాగర్లమూడి మన్విత, 585 మార్కులు కె మారుతి సాధించి ముందంజలో ఉన్నారు. 580 మార్కులకు పైగా 15 మంది, 570 మార్కులకు పైగా 36 మంది, 560 మార్కులకు పైగా 59 మంది, 550 మార్కులకుపైగా 74 మంది, 500 మార్కులకు పైగా 122 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల అధినేత పేర్ని రాధాకృష్ణమూర్తి, కరస్పాండెంట్‌ పేర్ని సతీష్‌ చంద్రలు విద్యార్థులను అభినందించారు.
ఆదర్శ విద్యార్థుల విజయభేరి
ఇంకొల్లు ఆదర్శ విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించి ముందంజలో నిలిచారు. 589 మార్కు లతో బి మేఘన, కె లక్ష్మీసౌమ్య అగ్రస్థానంలో నిలిచారు. 588 మార్కులతో మైటీ జాన్సన్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది. 586 మార్కులు సాధించి ఆర్‌ గీతామాధురి, ఆశిష్‌ మెహరా తృతీయ స్థానంలో నిలిచారు. 580కి పైగా 8 మంది, 550 మార్కులకు పైగా 34 మంది, 500 మార్కులకు పైగా 42 మంది సాధించారన్నారు. హాజరైన 59 మందిలో 100కి 100 మార్కులు తెలుగులో ఆరుగురు, గణితంలో 22 మంది, సోషల్‌లో నలుగురు సాధించినట్లు కరస్పాండెంట్‌ తోటకూర విజయభాస్కర్‌ వివరించారు.
ఎంఆర్‌ఆర్‌ విద్యార్థుల హవా
ఇంకొల్లు ఎంఆర్‌ఆర్‌ ప్రకాశం హైస్కూలు విద్యార్థులు హవా చాటారు. ఎం కృష్ణ భవాని 580, టి సిరివల్లి 571, జి సాయి సందీప్‌ 566 మార్కులు సాధించారు. 42 మంది విద్యార్థుల్లో 21 మంది 500కిపైగా మార్కులు సాధించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పావులూరు హైస్కూలు ముందంజ
పదో తరగ తి పరీక్షా ఫలితాల్లో ఇంకొల్లు మండలం పావులూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి కంచర్ల స్వాతి 579 మార్కులు సాధించి అగ్రగామిలో నిలిచారు. దుద్దుకూరు ఆచార్య రంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి పి ప్రేమలత 572 మార్కులు సాధించింది. ఇంకొల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి పఠాన్‌ హునీరా 558 మార్కులు సాధించింది. ఎయిడెడ్‌ పాఠశాలల విభాగాల్లో ఇడుపుల పాడు విద్యా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్ధి కె జయలక్ష్మి 539 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. గంగవరం వలేటి కృష్ణయ్య ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం సంజన 537 మార్కులు సాధించింది. ఇంకొల్లు ఎన్‌ఆర్‌అండ్‌విఎస్‌ఆర్‌ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని పి మాధురి 522 మార్కులు, పూసపాడు ఎస్‌కెఏవిఎస్‌ ఉన్నత పాఠశాల విద్యార్ధిని పి సారిక 477 మార్కులు సాధించింది.