Feb 01,2023 23:15

ప్రజాశక్తి - విజయవాడ రూరల్‌ :

ప్రజ్ఞా వికాసం పేరుతో 10 వ తరగతి మోడల్‌ పరీక్ష ఈ నెల 20 వ తేదీన నిర్వహించనున్నట్లు యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పి.మనోహర్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు ఎం. సోమేశ్వరరావులు తెలిపారు. నున్న హైస్కూల్‌లో బుధవారం వాల్‌ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. పరీక్షలో పదోతరగతి విద్యార్థులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈనెల 20వ తేదీన మోడల్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఈ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ఫీజు 25 రూపాయలు ఉంటుందని అన్నారు. పరీక్ష సమయం మధ్యాహ్నం 2గంటల నుండి 3గంటల 30 నిమిషాల వరక జరుగతుందన్నారు. విద్యార్థులలో భయాన్ని పోగొట్టి మనోధైర్యాన్ని నిలిపేందుకు ప్రముఖ విద్యావేత్త , కష్ణా,గుంటూరు గ్యాడ్యుయేట్‌ ఎం.ఎల్‌.సి. కె.ఎస్‌. లక్ష్మణరావు పర్యవేక్షణలో భారత విద్యార్థి ఫెడరేషన్‌-ఎస్‌ఎఫ్‌ఐ, యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌-యుటిఎఫ్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా కమిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పరీక్ష ''ప్రజ్ఞావికాసం'' 10 వ తరగతి విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ పరీక్ష 10 వ తరగతి సిలబస్‌ నుండి 100 మార్కులకు పరీక్ష ఉంటుందని, ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో ఉంటుంద న్నారు. ఫోన్‌ నెంబరు 9010849524లో రిజిస్ట్రేషన్‌ చేయించు కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నున్న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ (హెచ్‌.ఎం) భూపాలరెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.