పది పరీక్షల్లో ఉత్తీర్ణత పెంపునకు 57 రోజుల కార్యాచరణ ప్రణాళిక
ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ ఆదేశం
ప్రజాశక్తి-పాడేరు టౌన్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెంచడానికి 57 రోజుల కార్యాచరణ ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు.. గురువారం ఐటిడిఎ సమావేశ మందిరంలో 11 మండలాల ఎటిడబ్ల్యూఒలు, ఎంఇఒలు, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలతో నిర్వహించిన సమావేశం మాట్లాడుతూ టెన్త్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మాదిరి ప్రశ్నాపత్రాలు రూపొందించామని, దీనిపై ప్రతిరోజూ టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడంతోపాటు వారి స్థాయిని బట్టి తగిన శిక్షణ అందించాలన్నారు. పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలన్నారు
ఏప్రిల్ 3వ తేదీ నుండి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు. పాడేరు డివిజన్‌లో 39 పరీక్షా కేంద్రాలలో 153 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.టెన్త్ పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మన బడి, నాడు నేడు పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.. 31 శాతం మంది ఉపాధ్యాయులు ముఖ హాజరు వేయడం లేదని. దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, డిఇఒ డాక్టర్ పి.రమేష్, ఎటిడబ్ల్యూఒలు ఎల్.రజని, మల్లికార్జునరావు, క్రాంతికుమార్, 11 మండలాల ఎంఇఒలు, అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.










