లబ్ధిదారులకు రుణాలు అందజేస్తున్న సర్పంచ్ రవికిరణ్మయి
ప్రజాశక్తి-భట్టిప్రోలు: భట్టిప్రోలు గ్రామ పంచాయతీలోని జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు చేపట్టేందుకు ఒక్కొక్క లబ్ధిదారునికి రూ.35 వేల చొప్పున రుణాన్ని గ్రామ సర్పంచ్ దారా రవికిరణ్మయి చేతుల మీదుగా గురువారం అందజేశారు. బేసిమెంట్ వేసుకునేందుకు డ్వాక్రా గ్రూప్ ద్వారా ఈ రుణాన్ని అందజేసి నట్లు సర్పంచ్ పేర్కొన్నారు. గృహ నిర్మాణం చేపడితే ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు అవుతాయని, వాటి ద్వారా గృహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చునని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యులు షేక్ సలీమ్, ఏపిఎం శ్రీమన్నారాయణ, సిసి హనోక్, కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు చెన్నయ్య, శిరీష ఉన్నారు.










