'బతుకు' భయం గుప్పెట్లో చిక్కుకుంది
శత్రువు ఎవరో తెలిసినా.....
ఏమీ చేయలేని నిరాశ నిస్పృహ
చేతనత్వం ఉన్నా అచేతనంగా ఉన్న నాకు
పడిలేచే కెరటమే ఆదర్శం
కూడగట్టుకుని శక్తిని పూనించి
స్థితులకు పరిస్థితులకు ఎదురొడ్డి
మరో మనిషిగా నిలిచే నా మనోధైర్యం
నా దృఢ సంకల్పానికి పడిలేచే కెరటమే
నాకు స్ఫూర్తిని నింపిన గురువు
ఆవేదనలో ఆందోళనలో
అవకాశాలను వెదికే యుక్తిని
గడ్డు కాలాన్ని ఎదుర్కొనే శక్తిని
ధీశాలిగా నిలిచే నిబ్బరాన్ని
నేర్పింది పడిలేచే కెరటమే
వరదలు రానీ, వ్యాధులు రానీ
సునామీ రానీ, సుడిగుండాలే రానీ
ఏది ఏమైనా కానీ !
నిండుగా మెండుగా నాలో ఉండే
ఆత్మస్థైర్యమే నా ఆయుధం
పడిలేచే కెరటమే నాకు ఆదర్శం.
బొత్స గణేష్
79810 20791