పార్కు ప్రదేశాలను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్
ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో ఖాళీ ప్రదేశాలను గుర్తించి పచ్చదనం ఉట్టి పడేలా అభివృద్ధి చేయాలని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. శనివారం పట్టణంలోని మున్సిపాలిటీ ఖాళీ స్థలాలను, పార్కులను పరిశీలించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ... పట్టణంలో పచ్చదనం తక్కువగా ఉందని, సాయంకాల సమయంలో ప్రజలు సేద తీరడానికి పార్కుల అవసరమని తెలిపారు. వెంటనే పార్కులను అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఇంజినీర్ నాగభూషణం రెడ్డిని ఆదేశించారు. రాంజల మున్సిపల్ పార్కుల్లో విరివిగా మొక్కలు పెంచి ఆహ్లాద వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి పార్కుల స్థితిగతులను పరిశీలించి మెరుగుపరచాలని సూచించారు.










