Nov 22,2020 11:26

కావాల్సిన పదార్థాలు :
      కాలీఫ్లవర్‌ ముక్కలు- రెండు కప్పులు, నూనె- మూడు టీ స్పూన్లు, జీలకర్ర- అర టీ స్పూన్‌, ఆవాలు- అర టీ స్పూన్‌, మెంతులు- టీ స్పూన్‌, ఆవపిండి- మూడు టీ స్పూన్లు, కారం- రెండు టీ స్పూన్లు, మెంతిపిండి- చిటికెడు, ఉప్పు- తగినంత, నిమ్మకాయలు- మూడు.
                                            తయారుచేసే విధానం :
ముందుగా కాలీఫ్లవర్‌ను కడగాలి. తర్వాత ముక్కలుగా విడదీసి శుభ్రమైన వస్త్రం మీద ఆరబెట్టాలి.
పాన్‌లో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయాలి. అవి చిటపటమన్నాక కాలీఫ్లవర్‌ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు వేగించి దించాలి.
తర్వాత ఆ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పిండి మరోసారి కలిపితే కాలీఫ్లవర్‌ పచ్చడి రెడీ..!
దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు.