రాయచోటి టౌన్ : ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యేలా కషి చేయాలని నూతన ఎంఇఒ-2 లకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సూచి ంచారు. ఆదివారం అన్ని మండలాలలో నూతనంగా బాధ్యతలు స్వీక రించిన ఎంఇఒలు ఆంజనేయులు నాయుడు (చిన్నమ ండెం),వెంకట శివారెడ్డి (రాయచోటి),వెంకట సుబ్బయ్య (లక్కిరెడ్డిపల్లె), డి శ్రీనివాసులు (సంబేపల్లె), వి శ్రీనివాసులు (గాలివీడు), జయ చంద్ర ( రామాపురం ) ఎమ్మెల్యేను గౌరవ ప్రదంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మండలానికి ఇద్దరు ఎంఇఒలు ఉండాలని, అదనపు పోస్టును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్ చేయడం ఇద్దరు ఎంఇఒలకు సులువుగా ఉంటుందని, పనిభారం తగ్గడంతో ప్రశాంతంగా పాఠశాలలను పర్యవేక్షించి విద్యా ప్రమాణాలు మెరుగుపర్చవచ్చని చెప్పారు. పాఠశాలలను తరచూ సందర్శిస్తూ ఉత్తమ ఫలితాల సాధనకు కషి చేయాలని , నాడు నేడు పనులలో వేగం పెంచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. తరచూ పాఠశాలలను సందర్శిస్తూ మౌలిక వసతులపై ఆరా తీయాలన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే ఎప్పటికప్పుడూ పరిష్కరించాలని చెప్పారు.










