Aug 03,2023 21:13

ప్రజాశక్తి - చింతలపూడి
      నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయని చింతలపూడి అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ లీలా కూమరి తెలిపారు. పట్టణంలో సుప్రింపేట 3 చార్లెస్‌ నగర్‌లో తల్లిపాల వారోత్సవాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయని, తల్లిపాలల్లో వివిధ రకాల పోషకాలుంటాయని, అవి శిశువు పెరుగుదలకు ఉపకరిస్తాయని అన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తే సహజంగా రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎన్‌ఎం దేవమాత, అంగన్‌వాడీ టిచర్‌ మణి పాల్గొన్నారు.