Sep 20,2023 22:01

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం: సిడిపివో

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం: సిడిపివో
ప్రజాశక్తి - గూడూరు టౌన్‌: పౌష్టికాహారం తోనే ఆరో గ్యం వస్తుందని సిడిపివో మెహబూబీ అన్నారు. గూడూరు రెండో పట్టణం లోని గురుకుల పాఠశాల లో అంగన్‌వాడీ సిడిపిఓ మెహబూ బీ ఆధ్వర్యంలో గర్భిణీలు , బాలింతలకు పౌష్టికా హారం పై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. అనంతరం బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల పై అవగాహన కల్పిం చారు. బాల్యవివాహాలు చేయొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌ వైజర్‌ స్వరూపారాణి, అంగన్‌వాడీ కార్యకర్తలు విజయమ్మ హరిత, ఏఎన్‌ఎమ్‌ లు , మహిళా పోలీసులు పాల్గొన్నారు.