Jul 29,2023 02:05
ఉచిత వైద్యశిబిరంలో పాల్గొన్న వైద్యులు

ప్రజాశక్తి-చీరాల: పౌష్టిక ఆహారంతోనే మంచి ఆరోగ్యం లభిస్తుందని విద్యార్థులు అందరూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష్య కార్యదర్శులు శ్రీదేవి పి శ్రీకాంత్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని తోటవారిపాలెం గ్రామంలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్‌ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ వైస్‌ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వైద్యులు తమ గ్రామాన్ని దత్తతకు తీసుకొని గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. గ్రామంలో ప్రజలకు ఎలాంటి వైద్య అవసరాలు ఉన్నా ఐఎంఏ అండగా ఉంటుందని అన్నారు. మెడికల్‌ క్యాంపులో సుమారు 160 మంది పాల్గొనగా వైద్యులు వైద్య పరీక్షలతోపాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్‌ భవానీ ప్రసాద్‌, వైద్యులు డాక్టర్‌ గోరంట్ల రాజేష్‌, డాక్టర్‌ శ్రావణి, డాక్టర్‌ జి కృష్ణ చైతన్య, డాక్టర్‌ అపర్ణ, గుత్తి శ్రీనివాసరావు, పర్వతనేని శ్రీనివాసరావు, శేఖర్‌ వెంకట శేషయ్య, ఎన్‌ సురేష్‌ పలువురు పాల్గొన్నారు.