
చిన్నారులతో వైద్యులు, పాఠశాల కార్యదర్శి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు
ప్రజాశక్తి-హిందూపురం : పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తోందని ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు కేశవులు, రామచంద్ర రావు, ఆఫ్తాబ్ అన్నారు. గురువారం రూరల్ మండలం కిరికెర వద్ద ఉన్నా ఎల్‌ఆర్‌జి పాఠశాల కార్యదర్శి బాలసుందరం అధ్యక్షతన అఖిల భారత చిన్న పిల్లల వైద్యుల సమాఖ్య సౌజన్యంతో విద్యార్థులకు అరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతు మారుతున్న సమాజంలో ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వస్తున్నాయన్నారు. జంక్ ఫుడ్‌ను ఎక్కువగా చిన్నారులు వాడుతున్నారు వాటికి అలవాటు పడి అనారోగ్యానికి గురి అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ప్రసాద్, ఎఒ సంజీవ రెడ్డి, ఎహెచ్‌ఎం సుధ, హరినాథ్, వెంకట ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.