ప్రజాశక్తి - పర్చూరు
మండలంలోని ఎడారిపల్లిలో పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఎంపీడీవో వి ప్రద్యుమ్న కుమార్ మాట్లాడుతూ గ్రామంలో గర్భవతులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార కిట్లను ఉపయోగించుకొని రక్తహీనత లేకుండా ఉండాలని కోరారు. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన గ్రామాల్లో దొరికే చిరుధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలు ఎక్కువగా వాడాలని సూచించారు. 0నుంచి 5ఏళ్లలోపు పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచి బిరుదు నాగేంద్రమ్మ, పంచాయతీ సెక్రటరీ కె.శ్రీనివాసులు, ఐసిడిఎస్ సూపర్వైజర్ అన్నపూర్ణ పాల్గొన్నారు.










